దోహా ఎక్స్‌పో 2021 పోస్ట్‌పోన్‌

- July 30, 2020 , by Maagulf
దోహా ఎక్స్‌పో 2021 పోస్ట్‌పోన్‌

దోహా:స్టేట్‌ ఆఫ్‌ ఖతార్‌, ఇంటర్నేషనల్‌ హార్టికల్చరల్‌ ఎక్స్‌పో (ఎక్స్‌పో దోహా 2021)ని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. గ్రీన్‌ డిజర్ట్‌, బెటర్‌ ఎన్విరాన్‌మెంట్‌ థీమ్ లో దీన్ని నిర్వహించనున్నారు. అక్టోబర్‌ 2023కి ఈ ఎక్స్‌పోని వాయిదా వేశారు. ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ హార్టికల్చరల్‌ ప్రొడ్యూసర్స్‌ రికమండేషన్‌ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో అత్యవసర సమావేశం నిర్వహించి, వాయిదాపై నిర్ణయం తీసుకున్నారు. కాగా, మినిస్టర్‌ ఆఫ్‌ మునిసిపాలిటీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ అబ్దుల్లా బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ బిన్‌ టుర్కి అల్‌ జుబై ఈ వాయిదా నిర్ణయాన్ని స్వాగతించారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com