పన్ను చెల్లింపుదారులకు శుభవార్త!
- July 30, 2020
న్యూ ఢిల్లీ: భారత కేంద్ర ప్రభుత్వం తాజాగా పన్ను చెల్లింపుదారులకు శుభవార్త అందించింది. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ గడువు పొడిగించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ITR దాఖలు చేసే వారికి ఇది వర్తిస్తుంది. సెప్టెంబర్ 30లోపు ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయొచ్చు. దీంతో పన్ను చెల్లింపుదారులకు ఊటర కలుగనుంది.
కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితుల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. సాధారణంగా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ గడువు జూలై 31తో ముగియాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించారు.
ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ గడువు పొడిగించడం ఇది వరుసగా మూడో సారి కావడ గమనార్హం. సాధారణంగా ITRను మార్చి 31లోపు దాఖలు చేయాలి. అయితే దీన్ని జూన్ 30 వరకు పొడిగించారు. తర్వత జూలై 31కు ఎక్స్‌టెండ్ చేశారు. ఇప్పుడు మళ్లీ సెప్టెంబర్ చివరి వరకు గడువు ఇచ్చారు.
కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగేలా సీబీడీటీ ట్యాక్స్ రిటర్న్స్ గడువును పొడిగించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ITR దాఖలు గడువును జూలై 31 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఎక్స్‌టెండ్ చేసింది అని ఆదాయపు పన్ను శాఖ ట్వీట్ చేసింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?