దుబాయ్:విదేశీ ప్రయాణికులకు విజిట్ వీసాలు జారీ
- July 30, 2020
దుబాయ్: దుబాయ్ ప్రభుత్వం బుధవారం నుంచి విదేశీ ప్రయాణికులకు విజిట్ వీసాల జారీని ప్రారంభించినట్లు తెలిపింది. కరోనా వైరస్ నేపథ్యంలో యావత్ ప్రపంచమే స్వీయ నిర్భంధంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దుబాయ్ కూడా లాక్‌డౌన్ అయింది. అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు విధించడంతోపాటు అన్ని రకాల వీసాల జారీని నిలిపివేసింది.దుబాయ్ లో కరోనా ఉధృతి తగ్గుముఖంపట్టడంతో.. విదేశీ ప్రయాణికులకు విజిట్ వీసాల జారీని ప్రారంభించారు. బుధవారం రోజు దుబాయ్లోని జనరల్ డైరెక్టర్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారెనర్స్ అఫైర్స్ (GDRFA).కొన్ని మినహాయింపులతో అన్ని దేశాల పౌరులకు విజిట్ వీసాలు ఇవ్వడాన్ని ప్రారంభించిందని అమీర్ సెంటర్, ట్రావెల్ ఏంజెట్లు స్పష్టం చేశారు. కాగా.. అమీర్ బ్రాంచ్‌లోని కస్టమర్ సర్వీస్ అధికారి మాట్లాడుతూ...రెసిడెన్సీ, విజిల్ వీసాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు.
ASAT టూరిజం మార్కెటింగ్ మేనేజర్ కిరణ్ కుమార్ రెడ్డి కొవ్వూరి మాట్లాడుతూ... మేము బుధవారం కొన్ని అప్లికేషన్లను సమర్పించాము అన్నిటికీ వీసాలు వచ్చాయి. ఇది ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకుందన్నారు.ఈద్ అల్ అదా సందర్భంగా తమ కార్యాలయాలకు ఆదివారం వరకు సెలవులు తిరిగి సోమవారం ప్రారంభమవుతాయని సంబంధిత అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?