మోసపూరిత స్కీముపై సీబీఓ హెచ్చరిక

- July 30, 2020 , by Maagulf
మోసపూరిత స్కీముపై సీబీఓ హెచ్చరిక

మస్కట్‌: సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఒమన్‌ (సిబిఓ), మోసపూరిత స్కీముల పట్ల అప్రమత్తంగా వుండాలని పౌరులు అలాగే నివాసితులకు సూచించింది. వాట్సాప్‌ టెక్స్‌ట్‌ మెసేజ్‌ల రూపంలో మోసగాళ్ళు మోసాలకు పాల్పడుతున్నట్లు సిబిఓ హెచ్చరించింది. బ్యాంకు ఉద్యోగుల్లా కొందరు ఈ మెసేజ్‌లను పంపి, వినియోగదారుల నుంచి పూర్తి సమాచారాన్ని రాబట్టి, ఆ సమాచారం ద్వారా బ్యాంకు అకౌంట్ల నుంచి డబ్బుల్ని కొల్లగొడుతున్నారు. ఇటీవలి కాలంలో ఈ తరహా మోసాలు ఎక్కువగా వస్తున్నట్లు గుర్తించామని, వినియోగదారులు మరింత అప్రమత్తంగా వుండాలని సిబిఓ పేర్కొంది. బ్యాంక్‌ కార్డులు బ్లాక్‌ అయ్యాయనీ, ఇతరత్రా సమస్యలు వచ్చాయని చెప్పి వినియోగదారుల్ని మోసగాళ్ళు తమ వలలోకి లాగుతున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com