ఇండియా-యూఏఈ బుకింగ్స్ ప్రారంభం..జులై 31 నుంచి ఆగస్ట్ 15 వరకు బుకింగ్స్

- July 31, 2020 , by Maagulf
ఇండియా-యూఏఈ బుకింగ్స్ ప్రారంభం..జులై 31 నుంచి ఆగస్ట్ 15 వరకు బుకింగ్స్

యూఏఈ: ఎట్టకేలకు ఇండియా నుంచి యూఏఈకి విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. అబుధాబి, దుబాయ్, షార్జా ప్రయాణాలకు నేటి(జులై 31) నుంచి బుకింగ్స్ ప్రారంభించబోతున్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ప్రకటించింది. కొచ్చి, ఢిల్లీ, మంగళూరు, ముంబై, చెన్నై, హైదరాబాద్ నుంచి విమానాలు నడపనున్నారు. అయితే..ఐసీఏ, జీడీఆర్ఎఫ్ఏ ఆమెదించిన రెసిడెన్సీ వీసాదారులు మాత్రమే టికెట్ బుకింగ్స్ అర్హులు అని కూడా క్లారిటీ ఇచ్చారు అధికారులు. రెసిడెన్సీ వీసా గడువు ముగిసిన వారికి అనుమతి లేదని, టికెట్లు బుక్ చేసుకున్నా చెక్ ఇన్ సమయంలోనే వాళ్లను నిలిపివేస్తామని వెల్లడించారు. వీసా గడువు ముగిసిన వారు యూఏఈ వెళ్లాలనుకుంటే మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 

ఇండియా నుంచి యూఏఈ వెళ్లే ప్రయాణికులు చెక్ ఇన్ సమయంలో ఖచ్చితంగా తమ వెంట కోవిడ్ పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అది కూడా ప్రింటెడ్ కాపీని మాత్రమే అనుమతిస్తారు. ప్రయాణానికి 96 గంటలలోపు తీసుకున్న టెస్ట్ రిపోర్ట్ ను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఇక పన్నెండేళ్లలోపు పిల్లలకు కోవిడ్ టెస్ట్ రిపోర్ట్ అవసరం లేదని అధికారులు వెల్లడించారు. అయితే..దుబాయ్, అబుధాబి, షార్జా చేరుకునే ప్రయాణికులకు ఆయా విమానాశ్రయాల్లో ఒక్కో మార్గదర్శకాలను పాటించనున్నారు. 

దుబాయ్ : దుబాయ్ చేరుకునే ప్రయాణికులకు ఎయిర్ పోర్టులో కోవిడ్ పీసీఆర్ టెస్టులు నిర్వహిస్తారు. టెస్ట్ ఫలితాలు వచ్చేవరకు వారు ఇంట్లో ఉండాల్సి ఉంటుంది. ఒక వేళ పాజిటివ్ వస్తే దుబాయ్ ఆరోగ్య శాఖ మార్గనిర్దేశకాల మేరకు ఐసోలేషన్ పాటించాల్సి ఉంటుంది.

అబుధాబి: అబుధాబి చేరుకోగానే పీసీఆర్ టెస్ట్ చేస్తారు. అలాగే శరీర ఉష్ణోగ్రత చెక్ చేస్తారు.

షార్జా: షార్జా చేరుకోగానే కోవిడ్ పీసీఆర్ టెస్ట్ చేస్తారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com