మోసపూరిత స్కీముపై సీబీఓ హెచ్చరిక
- July 30, 2020
మస్కట్: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ (సిబిఓ), మోసపూరిత స్కీముల పట్ల అప్రమత్తంగా వుండాలని పౌరులు అలాగే నివాసితులకు సూచించింది. వాట్సాప్ టెక్స్ట్ మెసేజ్ల రూపంలో మోసగాళ్ళు మోసాలకు పాల్పడుతున్నట్లు సిబిఓ హెచ్చరించింది. బ్యాంకు ఉద్యోగుల్లా కొందరు ఈ మెసేజ్లను పంపి, వినియోగదారుల నుంచి పూర్తి సమాచారాన్ని రాబట్టి, ఆ సమాచారం ద్వారా బ్యాంకు అకౌంట్ల నుంచి డబ్బుల్ని కొల్లగొడుతున్నారు. ఇటీవలి కాలంలో ఈ తరహా మోసాలు ఎక్కువగా వస్తున్నట్లు గుర్తించామని, వినియోగదారులు మరింత అప్రమత్తంగా వుండాలని సిబిఓ పేర్కొంది. బ్యాంక్ కార్డులు బ్లాక్ అయ్యాయనీ, ఇతరత్రా సమస్యలు వచ్చాయని చెప్పి వినియోగదారుల్ని మోసగాళ్ళు తమ వలలోకి లాగుతున్నారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







