హీరోయిన్ అఖిల ఆకర్షణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్ర యూనిట్!
- July 31, 2020
హుషారు ఫేమ్ తేజ్ కూరపాటి , అఖిల ఆకర్షణ, జంటగా కల్పనా రెడ్డి, తనికెళ్ళ భరణి , జీవ, జోగి బ్రదర్స్ , ప్రధాన పాత్రలలో జి .వి .ఆర్ ఫిలిం మేకర్స్ సమర్పణలో , రాజధాని ఆర్ట్ మూవీస్ నిర్మాణంలో ముల్లేటి కమలాక్షి గుబ్బల వేంకటేశ్వర రావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ ఆహ్లాదకరమైన గ్రామీణ నేపధ్యంలో తెరకెక్కుతుంది. హీరోయిన్ అఖిల ఆకర్షణ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ అఖిల ఆకర్షణకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ పరిశర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ....
దర్శకుడు ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు, సినిమా బాగా వచ్చింది, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే ఒక లవ్ స్టోరీగా ఈ సినిమా ఉండబోతొందని తెలిపారు.
దర్శకుడు వెంకట్ వందెల మాట్లడుతూ....
హుషారు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తేజ్ ఈ సినిమాలో మరో డిఫరెంట్ రోల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అలాగే హీరోయిన్ అఖిల ఆకర్షణ ఈ సినిమాతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోబోతోంది, నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా ఎక్కడా కాంప్రమైజ్ కానివ్వకుండా సినిమా తియ్యటానికి పూర్తి సహకారం అందిస్తున్నారు. మనకు తెలీకుండా మనలో ప్రేమ పుట్టినప్పుడు మనకు ఆశ్చర్యం వేస్తుంది, ఆ ప్రేమ ఒక వ్యక్తి ద్వారా పుట్టిందని తెలిసినప్పుడు ఆ వ్యక్తి కోసం ఎంత దూరమైన వెళ్లాలనిపిస్తుందనే సస్పెన్స్ క్యూట్ లవ్ స్టొరీ ఇది.
నటి నటులు:
తనికెళ్ళ భరణి , జీవ, జోగి బ్రదర్స్ , కల్పనా రెడ్డి, బస్ స్టాప్ కోటేశ్వరావు , డా . ప్రసాద్ , మాధవి , సునీత మనోహర్ , అనంత్
సాంకేతిక నిపుణులు :
నిర్మాతలు: ముల్లేటి కమలాక్షి గుబ్బల వెంకటేశ్వర రావు
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: వెంకట్ వందెల
సంగీతం: సందీప్ కుమార్
స్క్రీన్ ప్లే, లిరిక్స్: డాక్టర్ భవ్య దీప్తి రెడ్డి
కెమెరామెన్: వంశీ ప్రకాష్
ఎడిటింగ్: కె.రవికుమార్
కొరియోగ్రాఫర్: గణేష్ స్వామి, నండెపు రమేష్
స్టంట్స్: రామకృష్ణ
చీఫ్ కో డైరెక్టర్: ఎల్.రామకృష్ణం రాజు
పిఆరోఓ: సాయి సతీష్
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







