గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన మిమిక్రీ ఆర్టిస్ట్, నటుడు శివారెడ్డి
- July 31, 2020
హైదరాబాద్:గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన మిమిక్రీ ఆర్టిస్ట్, నటుడు శివారెడ్డి. ఈరోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మణి కొండ లోని తన నివాసంలో మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజ్య సభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన ఈ కార్యక్రమం ఒక యుద్దంలా పర్యావరణ ప్రేమికులు అంతా ముందుకు తీసుకెళ్తున్నారు అని తెలిపారు. ఇంతటి కార్యక్రమం లో తననూ భాగస్వామిని చేసిన, మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
అదే విధంగా , ఈ ఛాలెంజ్ ను ముందుకు తీసుకు పోవడంలో భాగంగా , హాస్యనటుడు ఆలీ, కరీంనగర్ పోలీస్ కమీషనర్ కమలహాసన్ రెడ్డి, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు, పాటల రచయిత కాసర్ల శ్యామ్ మరియు తన సోదరుడు కళాకారుడు సంపత్ కు మూడు మొక్కలు నాటే ఛాలెంజ్ విసిరారు.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్







