అల్లు అర్జున్ - డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా
- July 31, 2020
అల వైకుంఠపురం లో వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తో సరి కొత్త ఇండస్ట్రీ రికార్డ్స్ నెలకొల్పి, అదే ఉత్సహంతో వరుస సినిమాలుతో తన అభిమానులని అలరించడానికి సిద్ధం అవుతున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఇప్పటికే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అప్ కమింగ్ మూవీ "పుష్ప" కి సంబంధించిన వివిధ పనులు శర వేగంగా జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో మరో క్రేజీ సినిమాతో ఫాన్స్ కి స్పెషల్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు స్టైలిష్ స్టార్, వరుస బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న కొరటాలశివ తో కలిసి సినిమా చేయబోతున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. యువ సుధ ఆర్ట్స్ బ్యానర్ పై సుధాకర్ మిక్కిలినేని పాన్ ఇండియా రేంజ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. మరో అగ్ర నిర్మాణ సంస్థ జీ ఏ 2 పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్ లో నిర్మాణంలో భాగస్వామిగా ఉండనుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మిత్రులు శాండీ, స్వాతి, నట్టి లు జీ ఏ 2 పిక్చర్స్ సారథ్యంలో ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా వ్యవహరించబోతున్నారు.
స్నేహితులే చిత్ర నిర్మాణ సారధులు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన స్నేహితుల్ని, బంధువుల్ని, సన్నిహితులని తన సినిమాల్లో భాగం చేస్తుంటారు. ‘రేసుగుర్రం’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’, ‘పుష్ప’ సినిమా నిర్మాణంలోనూ ఆయన బంధువులు భాగం పంచుకున్నారు. మరోసారి అదే తరహాలో తన మిత్రులు శాండీ, స్వాతి, నట్టి లకు ఈ చిత్రానికి సహ నిర్మాతులుగా వ్యవహరించేందుకు అవకాశం ఇచ్చారు. ఇది ఇలా ఉండగా డైరెక్టర్ కొరటాల శివ కి సన్నిహితుడు, స్నేహితుడైన మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని యువ సుధ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించడం విశేషం.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ కి ఫుల్ క్రేజ్
అటు డైరెక్టర్ కొరటాల శివ ఇప్పటికే వివిధ స్టార్ హీరోలతో పని చేశారు, ఇటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వివిధ ప్రముఖ దర్సకులతో పని చేశారు. కానీ ఈసారి మాత్రం వీరిద్దరి కాంబినేషన్ సెట్ అవ్వడం తో ఈ ప్రాజెక్ట్ పై అటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల్లో ఇటు సాధరణ ప్రేక్షకులుల్లో భారీగా అంచనాలు నెల కొన్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా రిలీజ్ అవ్వ బోతుంది.
బ్యానర్ : యువ సుధ ఆర్ట్స్ - జీ ఏ 2 పిక్చర్స్
నిర్మాత : సుధాకర్ మిక్కిలినేని
సహ నిర్మాతలు : సాండీ, స్వాతి, నట్టి
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?