కువైట్: చైల్డ్ వీసాలపై కొత్త మార్గదర్శకాలు..తల్లి స్పాన్సర్ షిప్ కు బదిలీ నిలిపివేత
- July 31, 2020
కువైట్ సిటీ:పిల్లల నివాస అనుమతి వీసాలను తమ తల్లుల పేరు మీదకు బదిలీ చేయటానికి సంబంధించి కువైట్ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇక నుంచి పిల్లల వీసాలకు సంబంధించిన అన్ని రకాల బదిలీ ప్రక్రియలను నిలిపివేయాలని నివాసిత అనుమతుల పరిపాలన వ్యవహారాల విభాగం అధికారులు ఆదేశించారు. తండ్రి శాశ్వతంగా దేశం విడిచి వెళ్లినా, అతని నివాస అనుమతి గడువు ముగిసినా, అతను దేశం వెలుపల ఉన్నా పిల్లల నివాస అనుమతులను వారి తల్లి స్పాన్సర్ షిప్నకు పేరు మీదకు బదిలీ చేయకూడదని కొత్త మార్గదర్శకాల్లో సూచించింది. ఈ మేరకు కువైట్ లోని ఆరు గవర్నరేట్లకు సూచనలు వెలువడ్డాయి. అయితే..కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం బదిలీకి అనుమతి ఇచ్చారు. ఒకవేళ సదరు మహిళ విద్యాశాఖలో టీచర్ గా విధులు నిర్వహిస్తున్నా, వైద్యశాఖలోని మెడికల్ అండ్ నర్సింగ్ విభాగాల్లో ఉద్యోగం చేస్తున్నా..క్రిమినల్ ఎవిడెన్స్ జనరల్ డిపార్ట్మెంట్ లో డాక్టర్లుగా విధులు నిర్వహిస్తున్న మహిళల పేరు మీదకు పిల్లల రెడిసెన్సీ వీసాలను బదిలీ చేసుకోవచ్చు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?