‘సైబర్’ - ‘ఆమె’ కోసం.!
- July 31, 2020
హైదరాబాద్:తెలంగాణ స్టేట్ పోలీస్, ‘సైబర్’ పేరుతో - సైబర్ స్పేస్ సేఫ్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్ పేరుతో ఓ ఆన్‌లైన్ ఎవేర్‌నెస్ క్యాంపెయిన్‌ని ప్రారంభించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఎక్కువమంది ఎక్కువ సమయంలో ఆన్‌లైన్‌లో గడుపుతుండడంతో, వివిధ రకాలైన మోసాలూ పెరుగుతున్నాయి.మరీ ముఖ్యంగా మహిళలు, చిన్న పిల్లలు ఈ తరహా మోసాలకు ఎక్స్‌పోజ్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ‘సైబర్’ క్యాంపెయిన్ వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఎలా వుండాలి.? మోసగాళ్ళను గుర్తిస్తే ఎలా పోలీసులకు ఫిర్యాదు చేయాలి.? వంటి విషయాలపై ఈ క్యాంపెయిన్‌లో అవగాహన కల్పిస్తారు. లైవ్ సెషన్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోలు, ఫ్లయర్స్, మాడ్యూల్స్, సర్వేలు, పోల్స్ ఫ్యాక్ట్ ఫ్రైడేస్ వంటి కార్యక్రమాల్ని ఇందులో పొందుపరుస్తారు. పోస్టర్ మేకింగ్, కామిక్ స్ట్రిప్, ఆర్టికల్ రైటింగ్ మరియు వీడియో మేకింగ్ విభాగాల్లో పోటీలు కూడా నిర్వహిస్తారు.
తెలంగాణ స్టేట్ పోలీస్ లీగల్ ఎయిడ్ సెంటర్, సింబియోసిస్ లా స్కూల్ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. http://www.cybher.in ద్వారా ఈ క్యాంపెయిన్‌లో 11,000 మందితో పాటు మీరుకూడా పాల్గొనండి.
యునిసెఫ్, సైబర్‌పీస్ ఫౌండేషన్, ఐఎస్ఐసి మరియు అనేక జాతీయ మరియు అంతర్జాతీయ సంస్థలు ఈ క్యాంపెయిన్ తమ సహకారాన్ని అందిస్తున్నాయి. ఈ క్యాంపెయిన్ కు 'మాగల్ఫ్.కామ్' మీడియా పార్టనర్ గా వ్యవహరిస్తోంది.
ఈ క్యాంపెయిన్ కి సంబంధించిన పోస్టర్ ని సుమతి బడుగుల,ఐ.పి.ఎస్(డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ తెలంగాణ పోలీస్,విమెన్ సేఫ్టీ వింగ్),మహేందర్ రెడ్డి,ఐ.పి.ఎస్(డైరెక్టర్ జనరల్ ఆఫ్ తెలంగాణ పోలీస్),స్వాతి లక్రా,ఐ.పి.ఎస్(అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ తెలంగాణ పోలీస్,విమెన్ సేఫ్టీ వింగ్) విడుదల చేసారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?