ఏపీలో కొత్తగా 9276 కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో కొత్తగా 9276 కరోనా పాజిటివ్ కేసులు

అమరావతి:ఏ.పి‌లో గడిచిన 24 గంటల్లో 60,797 మందికి పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 20,12,573కి చేరింది. తాజాగా నిర్వహించిన టెస్టుల్లో 9276 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. 58 మంది వైరస్ ‌బారినపడి మృతిచెందారు. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,47,341కి చేరగా. మృతుల సంఖ్య 1407కి చేరింది. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 12,750 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 76,614కి పెరిగింది. ఏపీలో ప్రస్తుతం 72,188 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పి‌)

Back to Top