యూఏఈ:బంపర్ ఆఫర్స్ తో వినియోగదారుల ముందుకు వచ్చిన బిగ్ టికెట్

- August 01, 2020 , by Maagulf
యూఏఈ:బంపర్ ఆఫర్స్ తో వినియోగదారుల ముందుకు వచ్చిన బిగ్ టికెట్

యూఏఈ:10 మిలియన్ల బంపర్ ప్రైజ్ మనీతో వినియోగదారుల ముందుకు వచ్చింది బిగ్ టికెట్. ఆగస్ట్ ప్రమోషన్స్ లో ఎక్కువ మంది వినియోగదారులు ప్రైజు మనీ గెలుచుకునే అవకాశాలను కల్పించింది. అంతేకాదు తొలి ఇద్దరు లక్కీ విన్నర్లు మిలియనర్లు అయ్యేలా 219వ డ్రా స్కీంలు రూపొందించింది. లక్కీ డ్రాలో తొలి ఇద్దరు విజేతలకు మిలియన్ల ప్రైజ్ మనీ ప్రకటించటం బిగ్ టికెట్ చరిత్రలోనే ఇదే తొలిసారి కావటం విశేషం. ఆగస్ట్ ప్రమోషన్ లో బిగ్ టికెట్ గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న లక్కీ విన్నర్ కు 10 మిలియన్ల అరబ్ ఎమిరేట్ దిర్హామ్ ల క్యాష్ మనీ దక్కుతుంది. ఇక సెకండ్ ప్రైజ్ మనీగా ఒక మిలియన్ల అరబ్ ఎమిరేట్  దిర్హామ్ ల క్యాష్ ప్రైజ్ దక్కుతుంది. దీనితో పాటు మరో 8 మందికి అదనంగా ఆగస్ట్ ప్రమోషన్ లో క్యాష్ ప్రైజ్ మనీ గెలుచుకునే అవకాశం కల్పించినట్లు బిగ్ టికెట్ నిర్వాహకులు వెల్లడించారు. అదేవిధంగా తమ 10 మిలియన్ల ప్రమోషన్ డ్రాలో వినియోగదారులు కార్ లను బహుమతులుగా విన్ అయ్యే చాన్స్ ఉంటుంది. గ్రాండ్ చెరోకి,
బీఎండబ్ల్యూ 420i లాంటి లగ్జరీ కార్లను వినియోగదారులు సొంతం చేసుకోవచ్చు. 


ఆగస్ట్ ప్రమోషన్ లో బిగ్ 10 మిలియన్ ప్రైజ్ మనీ వివరాలు ఇలా ఉన్నాయి.
గ్రాండ్ ప్రైజ్ మనీ AED 1,00,00,000
న్యూ సెకండ్ ప్రైజ్ AED 10,00,000
3వ  ప్రైజ్             AED 1,00,000
4వ  ప్రైజ్            AED 90,000
5వ  ప్రైజ్            AED 80,000
6వ  ప్రైజ్            AED 70,000
7వ  ప్రైజ్            AED 60,000
8వ  ప్రైజ్            AED 50,000
9వ  ప్రైజ్            AED 40,000
10వ  ప్రైజ్          AED 30,000

బిగ్ 10 మిలియనీర్ లక్కీ డ్రాలో పాల్గొనే వారు www.bigticket.ae వెబ్ సైట్ ద్వారా టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒక్కో టికెట్ విలువ వ్యాట్ కలుపుకొని 500 అరబ్ ఎమిరేట్ దిర్హామ్ ఉంటుంది. ఒకవేళ వినియోగదారులు రెండు టికెట్లు కొంటే మూడో టికెట్ పూర్తి ఉచితంగా పొందవచ్చు. వెబ్ సైట్ ద్వారా టికెట్ కొనలేని వారు అబుధాబి ఎయిర్ పోర్ట్ లోని తమ బిగ్ టికెట్ స్టోర్స్ టికెట్ కొనుకోవచ్చని నిర్వాహకులు వెల్లడించారు. ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 31 వరకు టికెట్లు అందుబాటులో ఉంటాయి. సెప్టెంబర్ 3న డ్రా ఉంటుంది. బిగ్ టికెట్ ఫేస్ బుక్, యూట్యూబ్ లో డ్రా ప్రత్యక్షప్రసారం అవుతుందని తెలిపారు. 


బిగ్ టికెట్ కు సంబంధించి వివరాల కోసం :
ట్విట్టర్: https://www.twitterewr.com/bigticketauh/
ఫేస్ బుక్: https://www.facebook.com/BigTicketAbuDhabi
ఇన్ స్టాగ్రామ్: https://www.instagram.com/bigticketauh/
వెబ్ సైట్: www.bigticket.ae
హెల్ప్ డెస్క్ నెంబర్ :  02 201 9244
ఈ-మెయిల్: help@bigticket.ae

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com