సంఘమిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సీపీ వీసీ సజ్జనార్‌

- August 01, 2020 , by Maagulf
సంఘమిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సీపీ వీసీ సజ్జనార్‌

హైదరాబాద్:ప్రజలకు మరింత చేరువయ్యేందుకు సైబరాబాద్ పోలీసుల మరో ముందడుగు వేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ శనివారం సంఘమిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. మానసిక కుంగుబాటుకు గురవుతున్న వారికి ఈ సంఘమిత్ర వాలంటీర్లు అండగా నిలవనున్నారు. మహిళలకు అండగా సైబరాబాద్ సెక్యురిటి కౌన్సిల్ కూడా ఉండనుంది. శనివారం జూమ్ అప్ ద్వారా ఈ కార్యక్రమంలో సినీ నటి అమల, మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భాదితులకు పోలీసులకు మధ్య వారధిగా సంఘమిత్ర వాలంటీర్లు వ్యవహరిస్తారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మాట్లాడారు.

‘‘సంగమిత్ర కార్యక్రమం అందరి కోసం ఏర్పాటు చేశాం. తెలంగాణ రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం ఎన్నో కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. మహిళలు, యువతుల పట్ల వేధింపులకు పాల్పడితే శిక్ష పడేలా చూస్తాం. మహిళల కోసం షి షటిల్ 9 టీమ్స్ ద్వారా అనేక విధాలుగా అందరికీ దగ్గరయ్యాం. 2 వేల మంది ట్రాఫిక్ వాలంటీర్స్ ద్వారా ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నాం. పెట్రోలింగ్ వ్యవస్థ బలోపేతం అయింది. చిన్నారులు, మహిళ భద్రత కోసం 13 షి టీమ్స్ ఏర్పాటు చేశాం. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ పరిధిలో డయల్ 100 పైన ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ఎలాంటి కాల్స్ వస్తున్నాయి. దీనిపై పర్యవేక్షించడానికి ఒక టీమ్‌ను అందుబాటులోకి తెచ్చాం. ఫిర్యాదులపై వెంటనే స్పందించేందుకు అన్ని విధాలా ఏర్పాట్లు కూడా చేశాం.’’

ప్రజలను పోలీసులతో భాగస్వామ్యం చేస్తున్నాం
760 మార్గదర్శక్, సంగమిత్ర గ్రూపులు ఉన్నాయి. ఎలాంటి సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురండి. సంగమిత్ర గ్రూపులో ప్రతి ఒక్కరూ మెంబర్ షిప్ తీసుకోండి. ప్రజలకు సమస్యలు ఎదురైతే అందులో తెలపండి. ఎలాంటి ఉల్లంఘన జరిగినా మా దృష్టికి తీసుకు రండి. సెక్యూరిటీ, సైబర్ క్రైమ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాం.’’

‘‘ప్లాస్మాపై అనేక కాల్స్ సైబరాబాద్ పోలీస్‌కు వస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్లాస్మా దాతలు వస్తున్నారు. ప్లాస్మా దాతలు ప్రాణ దానం చేస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్న ప్రతి ఒక్కరూ ప్లాస్మా దానం చేయడానికి ముందుకు రండి’’ అని సీపీ సజ్జనార్ పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com