ఈ సంవత్సరం జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించిన ఏ.పి గవర్నర్

- August 02, 2020 , by Maagulf
ఈ సంవత్సరం జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించిన ఏ.పి గవర్నర్

విజయవాడ: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి వలన నెలకొని ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం.ఆగస్టు 3 న తన జన్మదిన వేడుకలను జరుపకూడదని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వ భూషన్ హరిచందన్ నిర్ణయించారు. వ్యక్తిగతంగా జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి రాజ్ భవన్ కు ఎవరూ రాకూడదని గవర్నర్ బిస్వ భూషన్ హరిచందన్ సంబంధిత వారు అందరికీ విజ్ఞప్తి చేశారు. ఇళ్లలోనే ఉండి, అనవసరమైన ప్రయాణాలు చేయకుండా ఉండటం, సామాజిక దూరం పాటించడం, ఫేస్ మాస్క్ ధరించడం, శానిటైజర్ లేదా సబ్బుతో చేతులు కడుక్కోవడం వంటి అన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కరోనా వ్యాప్తిని నిరోధించవచ్చని గవర్నర్  హరిచందన్ మరోసారి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన విధంగా అవసరమైన అన్ని ప్రోటోకాల్స్ మరియు పద్ధతులను పాటించడం ద్వారా మాత్రమే కరోనా వైరస్ వ్యాప్తిని నివారించవచ్చని గవర్నర్ హరిచందన్ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com