కోవిడ్ 19: బహ్రెయిన్ లో సున్నాకు చేరిన కోవిడ్ మృతుల సంఖ్య

- August 02, 2020 , by Maagulf
కోవిడ్ 19: బహ్రెయిన్ లో సున్నాకు చేరిన కోవిడ్ మృతుల సంఖ్య

మనామా:బహ్రెయిన్ లో కోవిడ్ డెత్ రేట్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. శనివారం కోవిడ్ మృతుల సంఖ్య సున్నాకు చేరింది. అంతేకాదు..కరోనా బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 371కి పెరిగింది. దీంతో బహ్రెయిన్ వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 38,211కి చేరినట్లు బహ్రెయిన్ ఆరోగ్య శాఖ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం కరోనా దేశవ్యాప్తంగా 2,832 యాక్టీవ్ కేసులు ఉండగా అందులో 2,789 మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. యాక్టీవ్ కేసులలో 81 మందికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. 43 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరోవైపు శనివారం దేశవ్యాప్తంగా 4,569 కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటివరకు కింగ్ డమ్ లో మొత్తం 8,35,567 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. లేటెస్ట్ గా నిర్వహించిన టెస్టులో 208 మందికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com