‘ఆకాశవాణి’ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల చేసిన రానా దగ్గుబాటి
- August 02, 2020
ఇప్పుడంటే వినోద మాధ్యమాలు ఎక్కువైయ్యాయి కానీ.. ఒకప్పుడు అందరికీ ప్రధాన వినోద సాధనం రేడియోనే. దీనికి అచ్చ తెలుగు పేరు ఆకాశవాణి. వార్తలు, పాటలు ఇలా అన్నీ విషయాలను సామాన్యులను అందించే ఈ ‘ఆకాశవాణి’ పేరుతో టాలీవుడ్‌లో ఓ సినిమా రూపొందుతుంది. ఏయు అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్‌పై పద్మనాభరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అశ్విన్ గంగరాజు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి తనయుడు, సింగర్ కాలభైరవ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను హీరో రానా దగ్గుబాటి తన ట్విట్టర్ ద్వారా ఆదివారం విడుదల చేశారు. ‘ఆకాశవాణి’ యూనిట్‌కు అభినందనలు తెలిపారు.
పిల్లాడు, రేడియో కాంబినేషన్ ఉన్న ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను చూస్తుంటేనే డిఫరెంట్ కాన్సెప్ట్ పీరియాడిక్ మూవీ అని అర్థమవుతుంది. అందమైన పల్లెటూరిలో ఓ పిల్లాడు ఆకాశవాణిని చూసి సంతోషంగా ఎగ్జయిట్ అవుతున్నాడు. ఈ సన్నివేశాన్ని ఎన్‌హెన్స్ చేసేలా మోషన్ పోస్టర్‌లో కాలభైరవ బ్యాగ్రౌండ్ స్కోర్ ఉంది. ఆహ్లాదమైన వాతావరణాన్ని నేపథ్య సంగీతం మనకు తెలియజేస్తుంది. ఈ చిత్రం కోసం అద్భుతమైన టీమ్ పనిచేసిందని రానా దగ్గుబాటి చెప్పినట్లు .. అద్భుతమైన కాన్సెప్ట్ మూవీకి ఆ రేంజ్ టెక్నీషియన్స్ కుదిరారు. జాతీయ అవార్డ్ గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా సంభాషణలు, సురేశ్ రగుతు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?