అయోధ్య రామ మందిరం భూమి పూజ ఆహ్వాన పత్రిక
- August 03, 2020
అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఆగస్టు 5న ప్రధాని మోడి శంకుస్థాపన చేయనున్నారు. అయిదు వెండి ఇటుకలతో భూమి పూజ నిర్వహించనున్నారు. ప్రధాన కార్యక్రమానికి మూడు రోజుల ముందు నుంచి వేద శాస్త్రాలను అనుసరించి క్రతువులు నిర్వహిస్తూ ఉన్నారు.

భూమి పూజ ఆహ్వాన పత్రిక సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. భూమి పూజ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్న కార్డు కాషాయం రంగులో ఉంది. భారత ప్రధాని మోదీతో పాటు మరో ముగ్గురి పేర్లు మాత్రమే ఉన్నాయి. మోదీ చేతుల మీదుగా భూమి పూజ జరుగుతున్నట్టు కార్టులో పేర్కొన్నారు. విశిష్ట అతిథిగా ఆరెస్సెస్ అధినేత మోహన్ రావ్ భగవత్ పేరుఉండగా.. ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనంది బెన్ పటేల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్లు మాత్రమే ఉన్నాయి. రామ మందిర ట్రస్ట్ ఛైర్మన్ మహంత్ నృత్య గోపాల్ దాస్ ఆహ్వానిస్తున్నట్టు కార్డు ఉంది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







