రూ.300తో కరోనా కవచ్ పాలసీ...
- August 03, 2020
న్యూ ఢిల్లీ:ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ తాజాగా తన కస్టమర్లకు తీపి కబురు అందించింది. అదేమిటి అంటే కెనరా బ్యాంక్ తమ ఖాతాదారులకు కోసం కరోనా కవచ్ అనే ఇన్సూరెన్స్ పాలసీని ప్రకటించింది. దీని ద్వారా కస్టమర్లు తక్కువ ప్రీమియం తో మంచి కవరేజ్ సొంతం చేసుకోవచ్చు .
కరోనా వైరస్ తీవ్రంగా విస్తరిస్తోంది. అనేక ఇబ్బందులు పెడుతోంది ఈ కరోనా. అందుకనే కెనరా బ్యాంక్ తమ కస్టమర్ల కోసం కొన్ని లాభాలని అందించే ధ్యేయం తో కస్టమర్ల కి అదిరిపోయే సర్వీసులు అందిస్తోంది. వీటిని కస్టమర్లు ఉపయోగించుకోవచ్చు. దీని కోసం మూడు ఇన్సూరెన్స్ కంపెనీల తో ఈ బ్యాంక్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ పాలసీ తీసుకున్న వారు కోవిడ్-19 వచ్చినప్పుడు హాస్పిటల్ లో ఖర్చులకు ఈ పాలసీ డబ్బులతో వైద్యం చేయించుకోవచ్చు అని కెనరా బ్యాంక్ చెప్పింది.
పాలసీ వివరాలు...
న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ, బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్, హెచ్‌డీఎఫ్‌సీ అగ్రో హెల్త్ ఇన్సూరెనస్ కంపెనీలతో ఈ పాలిసీల కోసం బ్యాంక్ జతకట్టింది. బ్యాంక్ కస్టమర్లు వారికి నచ్చిన ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి ఈ పాలసీ తీసుకోవచ్చు. అయితే ఈ ప్రీమియం రూ.300 నుంచే ప్రారంభం అవుతుంది.ఈ పాలసీ లో రూ.50,000 నుంచి రూ.5 లక్షల వరకు కవరేజ్ వినియోగదారులు పొందొచ్చు.ఈ పాలసీ తొమ్మిదిన్నర నెలలు పాటు వర్తిస్తుంది. ఈ పాలిసీ ద్వారా ఏ ఇబ్బంది లేకుండా ఇప్పుడు కరోనా వచ్చే వాళ్ళు వైద్యం చేయించుకోవచ్చు.గది అద్దెకు క్యాపింగ్ లేదు, మరియు 15 రోజుల వరకు ఇంటి సంరక్షణ చికిత్స చేయించుకోవచ్చు.కాబట్టి వినియోగదారులు వీటన్నిటినీ తెలుసుకుని ఉపయోగించుకోవచ్చు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







