రెస్టారెంట్‌గా మారిన బార్బర్‌ షాప్‌ మూసివేత

- August 03, 2020 , by Maagulf
రెస్టారెంట్‌గా మారిన బార్బర్‌ షాప్‌ మూసివేత

రియాద్: రెస్టారెంట్‌లా మారిన ఓ బార్బర్‌ షాప్‌ని సౌదీ అథారిటీస్‌ మూసివేయడం జరిగింది. ఇల్లీగల్‌ వలస లేబరర్‌ ఈ రెస్టారెంట్‌ని నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఎలాంటి హెల్త్‌ సర్టిఫికెట్‌ లేకుండా దీన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అల్‌ మెస్‌ఫాలా సబ్‌ మునిసిపాలిటీ చైర్మన్‌ ఇంజనీర్‌ యాసిర్‌ బిన్‌ సలెహ్‌ మక్కావి మాట్లాడుతూ, హెల్త్‌ కంట్రోల్‌ డిపార్ట్‌మెంట్‌ ఇన్‌స్పెక్టర్స్‌, ఈ రెస్టారెంట్‌ని గుర్తించి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ రెస్టారెంట్‌ నుంచి స్వాధీనం చేసుకున్న ఆహార పదార్థాల్ని ధ్వంసం జరిగింది. గ్యాస్‌ పైప్‌లు, వివిధ రకాల వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. షాప్‌ స్పాన్సర్‌కి సమన్లు జారీ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com