ఫేస్ మాస్క్: ఈ ఉల్లంఘనలకి 3,000 దిర్హామ్ జరీమానా
- August 03, 2020
యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్, మాస్క్లు లేకుండా బయట తిరిగితే జరీమానా తప్పదని పౌరులు, రెసిడెంట్స్ని హెచ్చరించడం జరిగింది. ఇండోర్ పబ్లిక్ స్పేసెస్ లేదా షాపింగ్ సెంటర్స్ని సందర్శించే క్రమంలో మాస్క్ లేకపోతే జరీమానా విధిస్తారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగించేటప్పుడూ మాస్క్ ధరించడం తప్పనిసరి. పబ్లిక్ ప్రాంతాల్లో సంచరించేటప్పుడూ మాస్క్ ధరించాల్సిందే. ప్రైవేటు వాహనాల్లో వెళుతున్న సమయంలో ఇద్దరు లేదా అంతకు మించి ప్రయాణీకులు (ఒకే కుటుంబానికి చెందినవారు కాకుండా) వుంటే మాస్క్ తప్పనిసరిగా ధరించాల్సి వుంటుంది. స్మోకింగ్ వంటి సాకులు చూపాలనుకున్నా జరీమానా నుంచి తప్పించుకోవడానికి వీలుండదు. మాస్క్ ధరించనివారికి 3,000 దిర్హామ్ జరీమానా విధించడం జరుగుతుంది.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







