తెలంగాణ:ప్లాస్మా దాతలతో రక్షాబంధన్ జరుపుకున్న గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్

- August 03, 2020 , by Maagulf
తెలంగాణ:ప్లాస్మా దాతలతో రక్షాబంధన్ జరుపుకున్న గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్ రాజ్ భవన్ లో రక్షాబంధన్ ను వినూత్నంగా ప్లాస్మా దాతలతో జరుపుకున్నారు.కోవిడ్ నుండి కోలుకుని, ప్లాస్మా దానం చేసి సీరియస్ కండిషన్ లో ఉన్న ఎందరో ఇతర కోవిడ్ పేషెంట్లను కాపాడిన మొత్తం 13 మంది ప్లాస్మా దాతలకు గవర్నర్ రాఖీలు, స్వీట్లు అందించారు. 

రాజ్ భవన్ దర్బార్ హాలో లో జరిగిన ఈ ప్రత్యేక పండుగ సంబురాలలో భాగంగా గవర్నర్ ప్లాస్మా దాతల దాతృత్వాన్ని, ప్లాస్మా దానం కోసం వారు చేస్తున్న ప్రయత్నాలను గవర్నర్ అభినందించారు. వారు ఇతరులకు స్ఫూర్తి దాతలని కొనియాడారు. 

ఈ మొత్తం 13 మంది ప్లాస్మా దాతలు కోవిడ్ బారిన పడినప్పడు ప్రభుత్వ వైద్యశాలల్లోనే, ముఖ్యంగా గాంధీ హాస్పిటల్ లోనే చికిత్స తీసుకుని కోలుకున్నారు. 
ఇదే విషయాన్ని గవర్నర్ ప్రముఖంగా ప్రస్తావిస్తూ, “ప్రభుత్వ హాస్పిటల్స్, అక్కడి వైద్యులు కోమిడ్-19 చికిత్సలో గొప్ప సేవలు చేస్తున్నారని” అభినందించారు. 
ప్రజలు ఎలాంటి అపోహలకు తావు లేకుండా, ప్రభుత్వ హాస్పిటల్స్ లో కోవిడ్ చికిత్సను నమ్మకంగా తీసుకోవచ్చని, అక్కడ వైద్యులు, ఇతర సిబ్బంది అంకితభావంతో సేవలందిస్తున్నారని డా. తమిళిసై పేర్కొన్నారు. 

ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా తమ వద్దకు వస్తున్న కోవిడ్-19 బాధితులకు తక్కువ ఖర్చుతో, మానవతా దృక్పథంతో సవలు అందించాలి. రోగులను, వారి కుటుంబాలను మరింత కుంగదీయకుండా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.ఈ రక్షాబంధన్ ప్లాస్మా దాతలు తమ కోవిడ్-19 చికిత్స, ప్లాస్మా దానం చేయడానికి వచ్చిన ప్రేరణ, తదితర సంగతులను గవర్నర్ తో పంచుకున్నారు. గవర్నర్ సేవలు, ఈ దిశగా చేస్తున్న కృషి తమలో స్ఫూర్తిని నింపాయని వివరించారు. 

ఈరోజు గవర్నర్ తో రాఖీలు, అభినందనలు అందుకున్న ప్లాస్మా దాతలలో రాష్ట్రంలో మొట్ట మొదటి కోవిడ్ పేషెంట్ రాంతేజ గంపాల, నాలుగు సార్లు ప్లాస్మా దానం చేసిన ఐఐటి, ముంబై, గ్రాడ్యుయేట్ బి. నితిన్ కుమార్, రాష్ట్రంలో మొదటి ప్లాస్మా దాత ఎన్నం శెట్టి అఖిల్ తో పాటు, సురం శివ ప్రతాప్, సయ్యద్ ముస్తఫా ఇర్ఫాన్, ఉమర్ ఫరూఖ్, డా. సుమీత్, జె. రాజ్ కుమార్, పంజగుట్ట ట్రాఫిక్ ఎస్సై పి. రామకృష్ణా గౌడ్, ఎస్. శివానంద్, డా. సాయి సోమసుందర్, డా. రూప దర్శిని తదితరులున్నారు. ఇందులో మొత్తం ఆరుగురు రెండు సార్లు, అంతకన్నా ఎక్కువసార్లు ప్లాస్మా దానం చేయడం అభినందనీయమని గవర్నర్ ప్రశంసించారు. 
ఈ కార్యక్రమంలో గవర్నర్ సెక్రటరీ సురేంద్రమోహన్, ఐ.ఎ.ఎస్, జాయింట్ సెక్రటరీలు జె. భవానీ శంకర్, సి.ఎన్. రఘుప్రసాద్, అనుసంధాన అధికారి సి.హెచ్. సీతారాములు, డా. కె. రాజారాం తదితరులు పాల్గొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com