అమితాబ్ బచ్చన్ కు 'అమూల్' గిఫ్ట్

- August 04, 2020 , by Maagulf
అమితాబ్ బచ్చన్ కు \'అమూల్\' గిఫ్ట్

బాలీవుడ్ ప్రముఖ నటులు అమితాబ్ బచ్చన్‌, అభిషేక్ బచ్చన్‌లకు జులై 11న కరోనా పాజిటివ్ రావడంతో ముంబైలోని నానావతి అసుపత్రిలో చేర్చారు. తర్వత ఐశ్వర్యారాయ్‌, ఆరాధ్యలకు కూడా పాజిటివ్ రావడంతో వారు కూడా హాస్పిటల్‌లో చేరారు. వీరువురు జులై 27న డిశ్చార్జ్ అయ్యారు. నెగటివ్ రావడంతో బిగ్ బీ మాత్రం ఆదివారం డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చారు. ఇప్పుడు ఇంటి నిర్భంధంలోనే ఉన్నారు. బిగ్ బీ కరోనాతో పోరాడి గెలిచిన సందర్భంగా డెయిరీ బ్రాండ్ అమూల్ కొత్త డూడుల్‌ను విడుదల చేసింది.

అమితాబ్ చేతిలో మొబైల్ పట్టుకొని సోఫాలో కూర్చున్నట్లు డూడుల్‌లో కనిపిస్తుంది. అమూల్ బిగ్‌బీ పక్కనే నిలబడి ఉంది. ఈ చిత్రాన్ని 'ఎబి' బీట్స్ 'సి' అనే ట్యాగ్‌లైన్‌ను జోడించారు. 'ఎబి' అంటే అమితాబ్ బచ్చన్‌, 'సి' అంటే కరోనా వైరస్‌ను సూచిస్తుందని అర్థం చేసుకోవాలి. ఈ పోస్ట్‌ను బిగ్ బీకి ట్యాగ్ చేయగా అమితాబ్ హావభావంతో హత్తుకున్నారు. ట్విటర్ ద్వారా అమూల్‌కు కృతజ్ఞతలు తెలియచేశారు. "మీ ప్రత్యేకమైన పోస్టర్ ప్రచారంలో నన్ను నిరంతరం ఆలోచించినందుకు అముల్ ధన్యవాదాలు" అని ట్వీట్‌లో రాశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com