హైదరాబాద్:ఆర్థిక మోసగాళ్ళున్నారు..తస్మాత్ జాగ్రత్త

- August 04, 2020 , by Maagulf
హైదరాబాద్:ఆర్థిక మోసగాళ్ళున్నారు..తస్మాత్ జాగ్రత్త

హైదరాబాద్: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదీనాగూడ ఏరియాలో సుబోత్ మరియు అతని స్నేహితులైన దీక్షిత్, ఉదయ్ జీవన్, రాహుల్ మలాని బిజినెస్, పెట్టుబడులు పేరుతో  మనీ సర్కులేషన్ స్కీములల్లో అమాయకులను దించుతూ, అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారు.  
తాము సూచించిన మనీ సర్కులేషన్ స్కీములల్లో పెట్టబడులు పెడితే లక్షల్లో సంపాదించవచ్చునని ఆశజూపి నమ్మించి.. ముగ్గురు  మహిళలను ట్రాప్ చేశారు.. అందులో ఒక మహిళ నుంచి సుబోత్ రూ.  15 లక్షలను వసూలు చేశాడు. ఇందుకు అతని స్నేహితులైన దీక్షిత్, ఉదయ్ జీవన్, రాహుల్ మలాని సహకరించారు. డబ్బు తీసుకోవడంతో పాటు సదరు మహిళను విధింపులకు గురి చేయడం తో పాటు అసభ్యకరంగా ప్రవర్తించారనే  ఫిర్యాదు మియాపూర్ పోలీసులు ఈరోజు మేరకు సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (EOW) సహకారంతో వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు. 
వీరు తమకు పరిచయం ఉన్న అమ్మాయిలను లోబర్చుకొని మనీ సర్కులేషన్ స్కీములల్లో  అమాయకుల నుంచి  డబ్బులు దండుకుంటున్నారు. 
ఇలాంటి ఆర్థిక మోసల కారణాల వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోవడంతోపాటు వారి సామాజిక బంధాలు దెబ్బ తినడం, తీవ్ర మనో వేధనకు లోనై  ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 
ప్రజలు, ముక్యంగా ఆడపిల్లలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని.. ఇలాంటి మోసగాళ్లను నమ్మవద్దని.. సైబరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు. మోసగాళ్లపై ఫిర్యాదు చేసేందుకు 9490617444 నంబర్ లేదా డయల్ 100 కు ఫోన్ చేయగలరు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com