కోవిడ్ ఎఫెక్ట్ : దుబాయ్ విద్యార్ధులకు ఈ ఏడాది దూరవిద్యా విధానం

- August 05, 2020 , by Maagulf
కోవిడ్ ఎఫెక్ట్ : దుబాయ్ విద్యార్ధులకు ఈ ఏడాది దూరవిద్యా విధానం

కరోనా ఎఫెక్ట్ ఈ విద్యా సంవత్సరంపై పెను ప్రభావం చూపిస్తోంది. విద్యార్ధుల తల్లిదండ్రులు పిల్లల్ని స్కూళ్లకు పంపించేందుకు సంకోచిస్తున్నారు. దీంతో ఈ విద్యాసంవత్సరంలో దూరవిద్య ద్వారా పాఠాలు నేర్చుకునేందుకు విద్యాశాఖ అవకాశం కల్పించింది. ఆగస్ట్ 30 నుంచి స్కూళ్లు ప్రారంభించాలనుకున్న నేపథ్యంలో తొలుత విద్యార్ధులకు ఇన్ క్లాస్ విద్యా విధానాన్నే అమలు చేయాలని యోచించింది. అయితే..పిల్లలను స్కూళ్లకు పంపించే విషయమై తల్లిదండ్రుల్లో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దుబాయ్ మానవ అభివృద్ధి, విజ్ఞాన అధికార విభాగం అన్ని స్కూళ్ల ప్రిన్సిపల్స్ కి తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ముఖాముఖి విద్యా విధానమే తమ విధానమైనప్పటికీ..విద్యార్ధుల తల్లిదండ్రులు కోరితే వందశాతం డిస్టెన్స్ లెర్నింగ్ సౌకర్యం కల్పించాలని ఉత్తర్వులో పేర్కొంది. భవిష్యత్తులో విద్యార్ధులు ముఖాముఖి విద్యకు దోహదం చేస్తుందని అభిప్రాయపడింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com