‘మెట్రో కథలు’ ఫస్ట్ గ్లింప్స్ పోస్టర్ను విడుదల చేసిన హారీశ్ శంకర్...
- August 05, 2020
ప్రస్తుత వినోద మాధ్యమాల్లో డిజిటల్ మాధ్యమం కీలకంగా మారింది. వినోదానికి పెద్ద పీట వేసే తెలుగు ప్రేక్షకులను డిఫరెంట్ కంటెంట్లతో ‘ఆహా’ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆకట్టు కుంటూ తనదైన గుర్తింపును సంపాదించుకుంది. తెలుగు ప్రేక్షకులను మెప్పించేలా ఒక వైపు ‘సిన్, లాక్డ్, మస్తీస్, గీతా సుబ్రమణ్యం’ వంటి వెబ్ సిరీస్లు, మరో వైపు ‘భానుమతి అండ్ రామకృష్ణ, కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమాలు అందించి ‘ఆహా’ అనిపించుకుంటోంది.
తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్తో ఎంగేజ్ చేస్తున్న ఆహా ఇప్పుడు మరో ఎగ్జయిటింగ్ ఒరిజినల్ ‘మెట్రో కథలు’తో ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ అయ్యింది. ‘పలాస 1978’ చిత్రంతో ఘన విజయం సాధించిన డైరెక్టర్ కరుణ కుమార్ ‘మెట్రో కథలు’ను తెరకెక్కిస్తున్నారు. తెలుగు రచయిత కదిర్ బాబు రచించిన ‘మెట్రో కథలు’ పుస్తకంలోని నాలుగు కథలను ఆధారంగా చేసుకుని హైదరాబాద్ నగరంలో నాలుగు జంటల మధ్య ఉండే అనుబంధాలు, భావోద్వేగాల సమాహారం(అంథాలజీ)గా ఈ ‘మెట్రో కథలు’ ఒరిజినల్ రూపొందింది. స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఆగస్ట్ 14న ఈ ఒరిజినల్ ‘ఆహా’లో ప్రసారం కానుంది. ఈ అంథాలజీ ఫస్ట్ గ్లింప్స్ పోస్టర్ను ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ విడుదల చేశారు.
అలీ రాజా, సనా, నందినీ రాయ్, రామ్ మద్దుకూరి, తిరువీర్, నక్షత్ర, రాజీవ్ కనకాల, గాయత్రి భార్గవి తదితరులు నటించిన ఈ అంథాలజీకి సినిమాటోగ్రఫీ: వెంకట ప్రసాద్, సంగీతం: అజయ్ అర్సాడ, ఎడిటర్: శ్రీనివాస్ వరగంటి, నిర్మాతలు: కిరణ్ రెడ్డి మందాడి, రామ్ మద్దుకూరి, కథ: మహ్మద్ కదిర్ బాబు, అడిషనల్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కరుణ కుమార్.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?