మస్కట్: గవర్నరేట్ల మధ్య శనివారం నుంచి లాక్ డౌన్ ఎత్తివేత

- August 06, 2020 , by Maagulf
మస్కట్: గవర్నరేట్ల మధ్య శనివారం నుంచి లాక్ డౌన్ ఎత్తివేత

మస్కట్:ఒమన్ లో కరోనా మహమ్మారి తీవ్రతపై సుప్రీం కమిటీ సమీక్షించింది. దేశంలో వైరస్ తీవ్రత, వ్యాప్తి తీరుపై తమకు అందిని రిపోర్ట్స్ ను పరిశీలించింది. జులై 25 నుంచి గవర్నరేట్ల మధ్య అమలులో ఉన్న లాక్ డౌన్ ను ఆగస్ట్ 8(శనివారం) వరకు కొనసాగించాలని సుప్రీం కమిటీ నిర్ణయించింది. అయితే..వ్యాప్తి నియంత్రణలో మెరుగదల కనిపించటంతో గవర్నరేట్ల మధ్య లాక్ డౌన్ నిబంధనలను పాక్షికంగా సడలించాలని కూడా నిర్ణయించింది. ఈ మేరకు శనివారం ఉదయం 6 గంటల నుంచి గవర్నరేట్ల మధ్య లాక్ డౌన్ ను ఎత్తివేసింది. అలాగే రాత్రి జనసంచారంపై ఉన్న నిషేధ సమయాన్ని రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కుదించింది. ఆగస్ట్ 15 వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుంది. అయితే..వైరస్ తీవ్రత నేపథ్యంలో దోఫర్ గవర్నరేట్ పరిధిలో మాత్రం లాక్ డౌన్ ను కొనసాగించాలని సుప్రీం కమిటీ నిర్ణయించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com