తెలంగాణ:ఇకపై మహిళలకు బ్యాంకు రుణాలు సులభతరం!

- August 07, 2020 , by Maagulf
తెలంగాణ:ఇకపై మహిళలకు బ్యాంకు రుణాలు సులభతరం!

తెలంగాణ:పేద మహిళలకు, స్వయం సహాయక సంఘాల మహిళల బ్యాంకు లావాదేవీలకు సంబంధించి ఐటీ విభాగం ఎమర్జింగ్‌ టెక్నాలజీ బ్లాక్‌చెయిన్‌తో రూపొందించిన బ్లాక్‌చెయిన్‌ – ప్రొటెక్షన్‌ ఆఫ్‌ స్త్రీ నిధి ట్రాన్జాక్షన్స్(బీ–పోస్ట్‌)ను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ విధానం ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 1.5 లక్షల మంది సంఘాలకు చెందిన మహిళలు స్త్రీ నిధి ద్వారా మంజూరయ్యే రుణాలకు క్రెడిట్‌ రేటింగ్‌ పొందే అవకాశం ఉంటుంది. తద్వారా బ్యాంకులు, ఫైనాన్షియల్‌ సంస్థల నుంచి రుణాలు పొందే వీలు కలుగుతుంది.

ఇకపై మహిళలకు బ్యాంకు రుణాలు సులభతరం కానున్నాయి.‘బీ పోస్ట్‌’ విధానంతో ‘స్త్రీ నిధి’ద్వారా మంజూరయ్యే రుణవితరణ, చెల్లింపులు సులువు కానున్నాయి. పౌర సేవలను అందించే టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ ప్రభుత్వం ముందు వరుసలో ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌ అన్నారు. బ్యాంకు లావాదేవీలపై అవగాహన లేని నిరుపేద మహిళలకు బీ పోస్ట్‌ ద్వారా సమర్థవంతంగా సేవలు అందుతాయన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com