యూఏఈలో 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న విజనరీ ఫైనాన్షియల్ పండిట్,ఇన్వెస్టిమెంట్ గురు
- August 07, 2020
యూఏఈ:బర్జీల్ జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీస్ ఫౌండర్ డైరెక్టర్ కెవి. షంషుద్దీన్, ఇటీవల ఓ వెబినార్ నిర్వహించారు. యూఏఈలో విజనరీ, ఫైనాన్షియల్ పండిట్ మరియు ఇన్వెస్టిమెంట్ గురుగా యాభై యేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. షార్జా రూలింగ్ ఫ్యామిలీ మెంబర్ షేక్ సుల్తాన్ బిన్ సౌద్ అల్ కాసెమి సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. త్రిస్సూర్‌లోని చవక్కాడ్‌కి చెందిన షంషుద్దీన్, 1970 జులై 21న దుబాయ్ చేరుకున్నారు, అనంతరం ఆయన షార్జాకి మారారు. 1976 నుంచి 2000 సంవత్సరం వరకు యూఏఈలో ఓ మోంటార్, ఫైనాన్షియల్ ఎడ్వైజర్‌గా కీలక భూమిక పోషించారు. వ్యాపార రంగంలో రాణించాలనుకున్నవారికి ఆదర్శప్రాయంగా మారారు. 2001లో జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌ని ప్రారంభించారు. ఇండియాలో ఇది ప్రస్తుతం లార్జెస్ట్ రిటెయిల్ బ్రోకరేజ్ హౌస్‌గా వుంది. తక్కువ ఆదాయం కలిగినవారికి, మధ్య స్థాయి ఆదాయం కలిగినవారికి షంషుద్దీన్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలు చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తున్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?