పవన్ కల్యాణ్ తో భాజపా నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు భేటీ
- August 07, 2020
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ గురువారం మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా జనసేనాని పవన్ కల్యాణ్ ని హైదరాబాద్ లో కలిసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ముచ్చటించారు. అంతేకాదు.. జనసేనతో కలిసి బీజేపీ ప్రణాళికలకు సంబంధించిన కీలక అంశాల్ని ఈ భేటీలో ముచ్చటించారు.
ముఖ్యంగా ఆ ఇద్దరి భేటీలో ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి అంశంపైనే చర్చ సాగింది. ఆర్థికంగా సామాజికంగా నిర్మాణాత్మకంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి ప్రణాళికా బద్ధమైన ప్లాన్ చేసేందుకు ఈ కలయిక అని తెలుస్తోంది. త్వరలో ఉభయులు సమావేశమై 2024 ఎన్నికల్లో ఒక బలమైన శక్తిగా అధికారంలోకి వచ్చే ప్రణాళికల్ని రూపుదిద్దనున్నారు. అలానే రాజధాని మార్పు సహా అమరావతిలోని రైతులు సమస్యలపైనా రకరకాల అంశాల్ని చర్చించాలని పవన్ - వీర్రాజు ఇద్దరు నిర్ణయించుకున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?