అపార అనుభవం..అయినా తప్పని ప్రమాదం:విషాదంగా ముగిసిన కెప్టెన్ దీపక్ సాథే ప్రయాణం

- August 08, 2020 , by Maagulf
అపార అనుభవం..అయినా తప్పని ప్రమాదం:విషాదంగా ముగిసిన కెప్టెన్ దీపక్ సాథే ప్రయాణం

దుబాయ్:ఐదు నెలల నిరీక్షణ తర్వాత..ఇంకొద్ది నిమిషాల్లో సొంత దేశంలో కాలుపెట్టబోతున్నామని సంతోషపడిన ఆ ప్రయాణికుల ప్రయాణం విషాదంగా ముగిసింది. అయినవాళ్లను, కుటుంబసభ్యులను కలుసుకునేందుకు వచ్చినవారు కొందరు, పరాయిదేశంలో ఉద్యోగాలు కొల్పోయి గుండెనిబ్బరం చేసుకొని పుట్టినదేశానికి పయనమైనవారు మరికొందరు. కరోనా సంక్షోభంతో జరిగిందేదో జరిగింది ప్రాణాలతో ఉంటే చాలా అయినవారితో బతికుదామని మనస్సు నిబ్బరపర్చుకొని దుబాయ్ నుంచి కోజికోడ్ వరకు చేరుకున్నారు. కానీ, అనూహ్య ప్రమాదం వారి కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఈ ప్రమాదంలో విమానాన్ని కమాండ్ చేసిన పైలట్ దీపక్ వసంత్ సాథేతో పాటు కో పైలట్ అఖిలేష్ కుమార్ కూడా ఉన్నారు. పైలట్ కెప్టెన్ దీపక్ వసంత్ సాథేకి పైలట్ 30 ఏళ్ల అనుభవం ఉంది. అంతేకాదు ఫ్లైట్ ను కమాండ్ చేయటంలో అతను అత్యంత ప్రతిభాశాలి. గతంలో భారత వైమానిక దళంలో సీనియర్ వింగ్ కమాండర్ గా విజయవంతంగా విధులు నిర్వహించి 2003లో రిటైర్ అయ్యారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో పైలట్ శిక్షణ పొందిన దీపక్ సాథే 58వ బ్యాచ్ లో గ్రాడ్యూయేట్ చేశారు. శిక్షణ సమయంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. త్రివిధ దళాల్లో శిక్షణ సమయంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినవారికి ఇచ్చే 'స్వార్డ్ ఆఫ్ ఆనర్' పురస్కారం కూడా అందుకున్నారు. ఆ తర్వాత దాదాపు పన్నెండేళ్ల పాటు వైమానికదళంలో విశేష సేవలు అందించారు. పదవీ విమరణ తర్వాత ఎయిర్ ఇండియలో పైలట్ గా కేరీర్ ప్రారంభించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com