కువైట్:ఐదు నెలల సుదీర్ఘ విరామం తర్వాత చర్చిలో మళ్లీ సామూహిక ప్రార్ధనలు
- August 08, 2020
కువైట్ సిటీ:కరోనా నేపథ్యంలో నెలల తరబడి ప్రార్ధనా మందిరాల్లో నిలిచిపోయిన సాముహిక ప్రార్థనలు ఎట్టకేలకు ప్రారంభం అయ్యాయి. కువైట్ లోని బిషప్ క్యాథలిక్ చర్చిలో దాదాపు 5 నెలల సుదీర్ఘ విరామం తర్వాత నిన్న సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. మాస్ పునప్రారంభమైన రోజునే పది మాసెస్ నిర్వహించారు. అయితే..సామూహిక ప్రార్థనలను నిర్వహించినా..కరోనా వ్యాప్తి నియంత్రణ ఆంక్షలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. చర్చీకి పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతి ఇస్తున్నారు. ఖచ్చితంగా భౌతిక దూరం పాటించటంతో పాటు మాస్కులు, గ్లౌజులు ఉంటేనే చర్చీలోకి అనుమతించారు. ఎవరైనా భక్తులు మాస్ లో పాల్గొనాలని కోరుకుంటే ముందస్తుగా www.avona.orgలో వారి పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. పరిమిత సంఖ్యలోనే అనుమతి ఉంటుంది కనుక విడతల వారీగా మస్ కు అనుమతిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన