భారత్ లో కొత్తగా 61,537 కరోనా కేసులు
- August 08, 2020
భారత దేశంలో కరోనా కేసులు ఇటీవల రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. శుక్రవారం 62వేలకు పైగా కొత్త కేసులు నమోదవ్వగా.. శనివారం 61వేలకు పైగా కేసులు బయటపడ్డాయి. మరోవైపు కరోనా మరణాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 61,537 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 20,88,612కు చేరింది. ఇప్పటివరకూ14,27,006 మంది కరోనా నుంచి కోలుకుని కోలుకొని డిశ్చార్జి అవ్వగా.. 6,19,088మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం ఒక్కరోజే 933 మంది కరోనాతో మృతి చెందగా.. మొత్తం కరోనా మరణాలు 42,518కి పెరిగారు. అయితే, కరోనా పరీక్షలు కూడా రికార్డు స్థాయిలో జరుపుతున్నారు. శనివారం ఒక్కరోజే 5,98,778 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ ప్రకటించింది. ఇప్పటివరకూ 2,33,87,171 కరోనా పరీక్షలు జరిగాయి. పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నప్పటికీ కరోనా రికవరీ రేటు కూడా అదే స్థాయిలో ఉండటం కాస్తా ఊరట కలిగిస్తుంది. దేశంలో కరోనా రికవరీ రేటు 68.32శాతంగా నమోదైంది.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!







