కోజికోడ్ విమాన ప్రయాణికులంతా అత్యవసర ప్రయాణికులే: దుబాయ్ దౌత్య కార్యాలయం
- August 08, 2020
దుబాయ్:కోజికోడ్ విమాన ప్రమాదంపై దుబాయ్ లోని దౌత్య కార్యాలయం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. విమానంలోని ప్రయాణికులు అంతా ఎమర్జెన్సీ ట్రావెలర్స్ అని దౌత్యకార్యాలయం అధికారి డాక్టర్ అమన్ పూరీ తెలిపారు. వందేభారత్ మిషన్ లో భాగంగా యూఏఈలో చిక్కుకుపోయిన వారిని భారత్ తీసుకువచ్చేందుకు చేపట్టిన వందే భారత్ మిషన్ లో భాగంగా...ఎయిర్ ఇండియా విమానం నిన్న మధ్యాహ్నం 1.45 గంటలకు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరింది. విమానంలో 184 ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నట్లు అమన్ పూరీ వివరించారు. ప్రయాణికుల్లో 128 పరుషులు, 46 మంది మహిళలు, పది మంది చిన్నారులు ఉన్నారు. నిన్న రాత్రి 7.40 గంటల ప్రాంతంలో ఎయిర్ విమానం కోజికోడ్ రన్ వేపై ల్యాండ్ అయ్యింది. అయితే..ల్యాండింగ్ సమయంలో అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోవటంతో 17 మంది చనిపోగా, 100 మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో పైలట్ కెప్టెన్ దీపక్ సాథే కూడా ఉన్నారని, కో పైలట్ కూడా మృతి చెందినట్లు సమాచారం అందుతోందని అమన్ పూరీ స్పష్టం చేశారు. ప్రమాదంలో ఎక్కువ మంది తీవ్రంగా గాయపడటం వల్ల మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందన్నారు. పైలట్ కెప్టెన్ దీపక్ సాథే మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం జరగ్గానే భారత ప్రభుత్వం ఢిల్లీలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసిందని, అలాగే కేరళా ప్రభుత్వం, డీజీసీఏ సంఘటన స్థలంలో ఉండి సహాయక చర్యలు చేపట్టిందన్నారు. అయితే..విమానంలోని ప్రయాణికులు అంతా అత్యావరంగా ఇండియా వెళ్లిన ప్రయాణికులేనిని అమన్ పూరీ పేర్కొన్నారు. మెడికల్ ఎమర్జెన్సీ, వీసా రద్దు కావటం, వీసా గడువు ముగియటంతో పాటు కొందరు ఉద్యోగాలు కొల్పోయినవారు ఇండియాకు తిరుగుప్రయాణం అయ్యారని వివరించారు. అలాగే ప్రయాణికుల్లో కొందరు తమ కుటుంబాలను కలుసుకునేందుకు వెళ్లినవారు ఉన్నారని తెలిపారు. అయితే..మృతుల సంఖ్య పెరుగుతుండటంతో ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటున్నామని, వివరాలు అందిన వెంటనే వారి కుటుంబాలకు సమాచారం చేరవేస్తామని దుబాయ్ లోని దౌత్య కార్యాలయం వెల్లడించింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







