దుబాయ్-కోజికోడ్ విమాన ప్రమాదానికి కారణం 'టేబుల్ టాప్' రన్‌వే..
- August 08, 2020
కేరళ:191 మందితో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం దుబాయ్ నుంచి కోజికోడ్ చేరుకుంది. విమానం లాండింగ్ సమయంలో ఘోరం జరిగింది.ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నడుపుతున్న బోయింగ్ 737-800 విమానం కోజికోడ్ విమానాశ్రయం రన్‌వే - మంగళూరు వంటి టేబుల్‌టాప్ రన్‌వే కావడంతో 35 అడుగుల వాలులో పడిపోయింది. ఫలితంగా విమానం రెండుగా విడిపోయింది. కోజికోడ్ రన్‌వే చుట్టూ రెండు వైపులా పెద్ధ లోయలు ఉన్నాయి. టేబుల్‌టాప్ రన్‌వేలు సాధారణంగా కొండ పైభాగంలో నిర్మించబడతాయి. పైగా రన్‌వేను ఓవర్‌షూట్ చేయడానికి ఎటువంటి మార్జిన్ లేకపోవడం వల్ల ల్యాండింగ్ సమయంలో అత్యంత జాగురూకత వహించాల్సి ఉంటుంది. అప్రమత్తంగా లేకపోతే రెప్పపాటు కాలంలోనే ప్రమాదాలు జరుగుతాయి. తాజా ప్రమాదం అటువంటిదే.
విమానం కూలిపోయినప్పుడు మంటలు చెలరేగలేదని, తద్వారా ప్రాణనష్టం తగ్గుతుందని ప్రభుత్వ సీనియర్ అధికారులు భావిస్తున్నారు. DGCA అధికారి ఒకరు మాట్లాడుతూ, విమానం సాధారణ వేగం కంటే ఎక్కువ వేగంతో లాండైనట్లు అనిపించింది. కోజికోడ్ తో పాటు మంగళూరు, మిజోరంలోని లెంగ్‌పుయి విమానాశ్రయం, సిక్కింలో పాక్యాంగ్ విమానాశ్రయం, హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా, కులు విమానాశ్రయాలు టేబుల్ టాప్ లలో నిర్మించబడ్డాయి. భారతదేశం వెలుపల ఉన్న ఇతర టేబుల్‌టాప్ విమానాశ్రయాలలో భూటాన్‌లోని పారో, నేపాల్‌లోని ఖాట్మండు ఉన్నాయి.
2010 లో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం కర్ణాటకలోని మంగళూరు విమానాశ్రయంలో రన్‌వేపైకి దూసుకెళ్లి లోయలో కూలిపోయి మంటలు చెలరేగడంతో 158 మంది మరణించారు. అదే మొదటి అతి పెద్ద విమాన ప్రమాదమని అధికారులు పేర్కొన్నారు. గత సంవత్సరం, దుబాయ్ నుండి మరో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం మంగళూరు వద్ద రన్‌వేపైకి దూసుకెళ్లి నిదానంగా ఆగిపోయింది. దీనివల్ల విమానంలో ఉన్న 181 మంది ప్రయాణికులు భయపడ్డారు. వాస్తవానికి 2010 లో మంగళూరు సంఘటన జరిగిన వెంటనే డిజిసిఎ విమానాలను కోజికోడ్ విమానాశ్రయంలో దిగకుండా నిషేధించింది. 2,860 మీటర్ల ఎత్తులో, కోజికోడ్ యొక్క రన్‌వే మంగళూరు కంటే 400 మీటర్ల పొడవు ఉంది. విమానం ల్యాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో కోజికోడ్ విమానాశ్రయంలో వాతావరణం పరిస్థితి కూడా అనుకూలంగా లేదు. వర్షాలు కురుస్తున్న కారణంగా రన్‌వే ఉపరితలంపై నీరు నిల్వ ఉండి నేల చిత్తడిగా ఉంది. ఇది విమానం స్కిడ్ అవడానికి దారి తీస్తుంది. సిబ్బంది కంట్రోల్ చేయలేని పరిస్థితి వస్తుంది. దాంతో సమయానికి విమానాన్ని ఆపడం పైలట్లకు మరింత కష్టమవుతుంది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







