టర్కీలో పేలుడు: 9మంది మృతి,25 మంది గాయలు
- February 06, 2016
టర్కీలోని సిజ్రే పట్టణంలోని ఓ భవంతిలో పేలుడు సంభవించి 9 మంది మృతి చెందగా, 25 మంది గాయపడ్డారు. హెచ్‌డీపీ నేతలు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం పట్టణంలోని ఓ భవంతిలో పేలుడు సంభవించి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మొత్తం 9 మంది మృతిచెందారు. ఘటనాస్థలానికి బయలుదేరిన అంబులెన్సులను భద్రతాదళాలు అడ్డుకున్నట్లు చెప్పారు. కుర్దిస్థాన్ వర్కర్స్ పార్టీ అనుబంధ మిలిటెంట్లు, భద్రతాదళాల మధ్య ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో గతేడాది డిసెంబర్ 14 నుంచి అక్కడ కర్ఫ్యూ కొనసాగుతోంది. ఈ ఘర్షణల్లో గాయపడ్డవారు సైతం జనవరి 23 నుంచి వైద్య సేవలకోసం వేచిచూస్తున్నారు.భద్రతాదళాలు అంబులెన్సులను పంపడానికి అనుమతించకపోవడంతో పరిస్థితులు దారుణంగా మారాయని పలువురు నేతలు పేర్కొన్నారు. క్షతగాత్రులకు వైద్యసేవలు అందడం లేదని హెచ్‌డీపీ నేతలు చేసిన ఆరోపణలను టర్కీ అధ్యక్షుడు ఎర్డొగాన్, ప్రధానమంత్రి దావుతొగ్లు కొట్టిపారేశారు. క్షతగాత్రులు ఎక్కడున్నా వైద్య సేవలు అందిస్తున్నట్లు వారు తెలిపారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







