సిఎజిగా బాధ్యతలు స్వీకరించిన గిరీష్ చంద్ర ముర్ము
- August 08, 2020
న్యూ ఢిల్లీ:జమ్మూ కాశ్మీర్ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ గిరీష్ చంద్ర ముర్ము శనివారం కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (సిఎజి) గా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ తదితరుల సమక్షంలో ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్లో అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ముర్ము బుధవారం జమ్మూ కాశ్మీర్ ఎల్జీ పదవి నుంచి వైదొలిగి గురువారం సిఎజిగా నియమితులయ్యారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 148 లోని 1 వ నిబంధన ద్వారా తనకు ఉన్న
అధికారాన్ని బట్టి, గిరీష్ చంద్ర ముర్మును కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా రాష్ట్రపతి నియమించారు. సిఎజిగా బాధ్యతలు చేపట్టిన ముర్ము రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల యొక్క అన్ని ఖర్చులను ఆడిట్ చేయడానికి బాధ్యత వహిస్తారు. ఈ పదవిలో ఆరు సంవత్సరాలు లేదా ఆయనకు 65 ఏళ్ళు వచ్చేవరకు ఏది మొదట వస్తే అంతవరకూ ఉంటారు. ఇదిలావుంటే సిఎజిగా బాధ్యతలు స్వీకరించిన మొదటి గిరిజనుడు గిరీష్ చంద్ర ముర్ము కావడం విశేషం.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?