1.3 మిలియన్ల సౌదీ రియాల్స్ చోరీ కేసులో ఐదుగురు అరెస్ట్
- August 08, 2020
సౌదీ: మదీనాలో చోరీకి పాల్పడిన ఐదుగుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో ఇద్దరు సౌదీలు ఉండగా, మరో ముగ్గురు యెమనీ నివాసితులు ఉన్నారు. మదీనాలోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితులు 1,50,000 సౌదీ రియాల్స్ తో పాటు 2,00,000 సౌదీ రియాల్స్ విలువైన బంగారు నగలను దొంగిలించినట్లు మదీనా పోలీసులు వివరించారు. నిందితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు తరలించి తదుపరి విచారణ చేపట్టినట్లు వివరించారు. ఇదిలాఉంటే మరో చోరీ ఘటనలో ఇద్దరు సౌదీ వ్యక్తులతో పాటు ఓ యెమన్ నివాసితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మదీనాలోని ఓ ఇంట్లో నుంచి 1,80,000 సౌదీ రియాల్స్, 2,00,000 సౌదీ రియాల్స్ విలువైన బంగారు అభరణాలను నిందితులు దోచుకెళ్లిన ఆరోపణల్లో వీరిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకొని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు తరలించినట్లు వివరించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?