మస్కట్: గతేడాదితో పోలిస్తే ఒమన్ లో తగ్గిన ప్రవాసీయుల సంఖ్య
- August 08, 2020
ఒమన్ లో ప్రవాసీయుల సంఖ్య రోజు రోజుకీ తగ్గుతూ వస్తోంది. ఒమనైజేషన్ లో భాగంగా గతంలో కంటే స్థానికులకే ఎక్కువ ప్రధాన్యం ఇస్తుండటంతో ఒమన్ లో బతుకుదెరువు కోసం వచ్చే వారి సంఖ్య ఈ ఏడాది గణనీయంగా తగ్గింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి అర్ధ వార్షికంలో ఒమన్ లోని ప్రవాసీయుల రేటు 9.3 శాతానికి తగ్గింది. దీంతో ప్రస్తుతం ఒమన్ లోని ప్రవాసీయుల సంఖ్య 15,89,883కి తగ్గింది. జాతీయ గణాంకాలు, సమాచార కేంద్రం దగ్గరున్న వివరాల మేరకు గతంతో పోలీస్తే ప్రస్తుత ఏడాది ప్రవాసీయుల సంఖ్య తగ్గుతున్నట్లు స్పష్టం అవుతోంది. ఒమనైజేషన్ తో పాటు కరోనా సంక్షోభ ప్రభావం కూడా విదేశీయుల రాకపై ఎఫెక్ట్ చూపించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?