వైభవంగా రానా, మిహీకాల వివాహం

- August 09, 2020 , by Maagulf
వైభవంగా రానా, మిహీకాల వివాహం

హైదరాబాద్:టాలీవుడ్ మోస్ట్ ఐకానిక్‌ బ్యాచిలర్‌ రానా దగ్గుబాటి.. తన బ్యాచ్‌లర్ లైఫ్‌కి పుల్ స్టాప్ పెట్టి, వివాహ బంధంతో నూత‌న జీవితంలోకి అడుగులేశారు. రానా తన ప్రియురాలు మిహీకా బ‌జాజ్ మెడలో శనివారం రాత్రి 8.30 నిమిషాలకు వేద మంత్రాల సాక్షిగా మూడు ముళ్లు వేసి, ఏడడుగులు నడిచాడు. ఈ వివాహానికి రామానాయుడు స్టూడియో వేదికైంది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ.. వీరి వివాహం జరగ్గా.. ఇరుకుటుంబాల నుంచి కేవలం 30 మంది మాత్రమే బంధువులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇండస్ట్రీ నుంచి సమంతతో పాటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సమంత, నాగచైతన్య‌లు వీరి వివాహవేడుకకు హాజరయ్యారు.

రానా- మిహీకాల వివాహన్ని తెలుగు-మార్వారీ సాంప్రదాయాల్లో జరిపించారు. మే నెలలో రానా తన ప్రేమ సంగతి బయటపెట్టాడు. మిహీకా బజాజ్‌ తన ప్రేమకు ఓకే చెప్పిందంటూ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. ఆ తర్వాత ఇరు కుటుంబాలు మాట్లాడుకొని పెళ్లికి అంగీకరించాయి. ఇక రానా పెళ్లి వేడుకలో సమంత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రానా బాబాయ్ విక్టరీ వెంకటేష్ సైతం పెళ్లిలో సందడి చేశారు. ప్రస్తుతం రానా-మిహీకా పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక టాలీవుడ్ సెలబ్రిటీలు వివాహ వేదిక వద్దకు రాకుండానే వీఆర్ టెక్నాలజీ సాయంతో పెళ్లిని చూస్తూ ఫొటోలను షేర్ చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో అతిథులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మీడియాను కూడా అనుమతించలేదు. వివాహ వేడుకలో పాల్గొనే స్టాఫ్‌కి ముందే కోవిడ్ టెస్ట్‌లు నిర్వహించడమే కాకుండా.. పెళ్లి వేదికతో పాటు పరిసరాలను మొత్తం శానిటైజ్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com