విజయవాడ:కోవిడ్ కేర్ సెంటర్ లో భారీ అగ్ని ప్రమాదం
- August 09, 2020
అమరావతి:విజయవాడలో కోవిడ్ కేర్ సెంటర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 11కు పెరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే ముగ్గురు చనిపోగా.. చికిత్స పొందుతూ మరో నలుగురు చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 11కి చేరింది. కొందరి పరిస్థితి విషమంగా ఉందని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని విజయవాడ సీపీ శ్రీనివాసులు తెలిపారు. కాగా.. రమేష్ ఆస్పత్రి ఆద్వర్యంలో హోటర్ స్వర్ణ పేలస్ లో పెయిడ్ కోవిడ్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఇందులో ముప్పై మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. పది మంది ఆస్పత్రి సిబ్బంది కూడా ఉన్నారు. షార్ట్ సర్యూట్ వలన ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. దట్టమైన పొగలతో మంటలు వ్యాపించడంతో ఇద్దరు ఆస్పత్రి సిబ్బంది భయంతో భవనంపై నుంచి దూకేసారు. వారిద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉందని తెలుస్తుంది. 15మంది రోగులను వివిధ ఆస్పత్రులకు తరలించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?