దుబాయ్ గవర్నమెంట్ ఉద్యోగులకు సౌకర్యమైన పనివేళలు..ఆగస్ట్ 16 నుంచి అమలు
- August 09, 2020
దుబాయ్:దుబాయ్ గవర్నరేట్ లోని ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఇక నుంచి తమకు అనువైన సమయాల్లో విధులకు హజరయ్యేలా వెసులుబాటు కల్పిస్తూ దుబాయ్ మానవ వనరుల విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ 16 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. అయితే..వర్కింగ్ అవర్స్ ఉదయం 6.30 నుంచి 8.30 గంటల మధ్య తమకు నచ్చిన సమయంలో విధులకు హజరవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుత ఎమర్జెన్సీ వెదర్ కండిషన్స్ లో ఉద్యోగుల భద్రతతో పాటు ఉద్యోగులకు జీవన ప్రమాణాలు నాణ్యతను పెంచేందుకు ఈ కొత్త విధానం ఎంతో దోహదపడుతుందని మానవ వనరుల శాఖ విభాగం అధికారులు వెల్లడించారు. అయితే..ఈ వెసులుబాటు కొన్ని విభాగాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే అమలు చేయనున్నారు. అత్యవసర విభాగాలు, ఎల్లప్పుడూ ప్రజలతో సమన్వయం చేసుకునే శాఖలకు చెందిన ఉద్యోగులకు, షిఫ్ట్ ల వారీగా విధులకు హజరయ్యేవారికి మాత్రం ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ విధానం వర్తించదని మానవ వనరుల శాఖ స్పష్టం చేసింది. ఆగస్ట్ 16 నుంచి అమలు సాధ్యమైన అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ విధానాన్ని అమలు చేసి..వాటి ఫలితాల తీరును తమకు రిపోర్ట్ చేయాలని మానవ వనరుల శాఖ వివిధ ప్రభుత్వ విభాగాలకు సూచించింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







