లాస్ట్‌ రైడ్‌ సేవలు ప్రారంభించిన సీపీ మహేశ్‌ భగవత్

- August 09, 2020 , by Maagulf
లాస్ట్‌ రైడ్‌ సేవలు ప్రారంభించిన సీపీ మహేశ్‌ భగవత్

హైదరాబాద్:కోవిడ్-19 పేరు వింటనే 100 అడుగుల దూరం పరిగెత్తే పరిస్థితి. కానీ.. వైరస్‌ బారిన పడి మృతిచెందిన వారి అంత్యక్రియలు గౌరవ ప్రదంగా నిర్వహించేందుకు ఫీడ్‌ ద నీడ్‌ సంస్థ ముందుకు వచ్చింది. రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన లాస్ట్‌ రైడ్‌ వాహనాన్ని సీపీ మహేశ్‌ భగవత్‌ శనివారం ప్రారంభించారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సేవలు వినియోగించుకోవచ్చని.. 7995404040, 9490617234 మొబైల్ నంబర్లలో సంప్రదించాలని ఈ సందర్భంగా కమీషనర్ తెలిపారు. ఈ వాహనంలో మృతదేహలను తరలించేందుకు అవసరమయ్యే 25 కిట్‌లను ఓ IT సంస్థ సమకూర్చింది. లాస్ట్‌రైడ్‌ సేవల రూపకల్పనలో కీలకంగా వ్యవహరిస్తున్న 10 మంది సంస్థ ప్రతినిధులను కమీషనర్ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యురిటీ కౌన్సిల్‌ ప్రధాన కార్యదర్శి కృష్ణ ఏదుల, రాచకొండ సైబర్‌ సెక్యురిటీ కౌన్సిల్‌ ప్రధాన కార్యదర్శి సతీశ్‌, రాచకొండ అడ్మిన్‌ అదనపు డీసీపీ శిల్పవల్లి తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com