విజయవాడ:అగ్నిప్రమాదంలో మృతుల కుటుంబాలకు 50లక్షల పరిహారం
- August 09, 2020
అమరావతి:విజయవాడలో కోవిడ్ కేర్ సెంటర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతుంది. సంఘటనా స్థలంలోనే ముగ్గురు చనిపోగా.. ఇప్పుడు మృతుల సంఖ్య 11కి చేరింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఆ కోవిడ్ సెంటర్ లో చికిత్స పొందుతున్న వారిని పలు ఆస్పత్రులకు తరలించారు. కాగా.. ఈ ఘటనపై స్పందించిన ఏపీ సీఎం..ప్రమాదానికి కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. అగ్ని ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు.మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయాలైన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







