భారత్:64వేలకు పైగా కరోనా కేసులు
- August 09, 2020
న్యూ ఢిల్లీ:భారతదేశంలో రికార్డు స్థాయిలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలో మొత్తం సోకిన వారి సంఖ్య ఇప్పటివరకు 21 లక్షలు దాటింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు 21 లక్షల 53 వేల 11 మందికి కరోనా సోకింది. వీరిలో 43,379 మంది మరణించగా 14 లక్షల 80 వేల 884 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో, 64 వేల 399మంది కొత్తగా కరోనా వైరస్ కేసులు నమోదవగా 861 మరణాలు సంభవించాయి.
కరోనా సోకిన వారి సంఖ్య ప్రకారం భారతదేశం ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది. కరోనా మహమ్మారి వల్ల యునైటెడ్ స్టేట్స్ ఎక్కువగా ప్రభావితం అవుతుంది. భారతదేశం కంటే ఎక్కువ కేసులు అమెరికా(5,149,663), బ్రెజిల్ (3,013,369)లో ఉన్నాయ. దేశంలో కరోనా కేసులు పెరిగే వేగం ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?