విజిట్ విసాపై భారత్ నుంచి యూఏఈ వెళ్లేందుకు లైన్ క్లియర్..త్వరలోనే ఉత్వర్వులు
- August 09, 2020
విజిట్ విసాపై భారత్ నుంచి యూఏఈ వెళ్లేందుకు మార్గం సుగమం అయ్యింది. ఈ మేరకు ఇండియా-యూఏఈ మధ్య 'ఎయిర్ బబుల్' ఒప్పందం కుదిరింది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ప్రయాణ సంబంధిత ఆంక్షల నుంచి ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు వీలుగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ ఒప్పందం చేసుకుంది. తద్వారా ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రయాణించే దేశాల జాబితాలో యూఏఈని కూడా త్వరలోనే చేర్చనున్నారు. అయితే..విజిట్ విసాపై యూఏఈకి వెళ్లే అంశం..పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి సాధారణ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాతే అమలులోకి వస్తుందని యూఏఈలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. పౌర విమానయాన శాఖ నుంచి నోటిఫికేషన్ విడుదల అయ్యే వరకు ఎవరూ టికెట్లు బుక్ చేసుకొవద్దని కూడా అధికారులు సూచించారు. ఇదిలాఉంటే విజిట్ విసాదారులు, ఉద్యోగాల అన్వేషణ కోసం వచ్చేవారిని యూఏఈ అనుమతించటం లేదని ఇటీవలె రాయబార కార్యాలయం అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే..యూఏఈ విసాల జారీని ఇటీవలె పునరుద్ధరించటంతో యూఏఈలోని భారత రాయబార కార్యాలయం..సరైన విసాలు ఉన్నవారిని ప్రయాణించేందుకు అనుమతించాలని భారత అధికారులను కోరింది. రెసిడెన్సీ వీసాదారులను మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తున్న నేపథ్యంలో విజిట్ విసాదారులు ప్రయాణ అనుమతి కోసం ఎదురుచూస్తున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లింది. ఈ పరిస్థితుల్లో విజిట్ విసాలపై యూఏఈ వెళ్లేందుకు మార్గం సుగమం చేసేలా సులభతర ప్రయాణ దేశాల జాబితాలో యూఏఈని కూడా చేర్చబోతోంది కేంద్ర ప్రభుత్వం. పౌరయాన మంత్రిత్వ శాఖ నుంచి నోటిఫికేషన్ వెలువడగానే ఇక అన్నిరకాల విసాదారులు భారత్ నుంచి యూఏఈ వెళ్లవచ్చు.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!







