కువైట్: మధ్యాహ్నం వేళలో పని నిబంధనలు ఉల్లంఘించిన 365 మంది కార్మికులు
- August 09, 2020
కువైట్ సిటీ:కువైట్ లో మధ్యాహ్నం పనివేళలపై నిషేధం ఉల్లంఘనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల పగటి వేళలో కార్మికులు పని చేస్తున్నట్లు మరో 59 ఫిర్యాదులు వచ్చాయని మానవ వనరుల శాఖ పౌర సంబంధాల విభాగం వెల్లడించింది. తమకు అందిన ఫిర్యాదుల మేరకు పలు పని ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేసినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 161 చోట్ల తనిఖీలు నిర్వహించి 266 కంపెనీల్లో మధ్యాహ్నం పని వేళల్లో నిషేధం అమలు తీరుపై ఎంక్వరీ చేశామన్నారు. తమ తనిఖీల్లో 365 మంది కార్మికులు పగటి పూట ఓపెన్ ప్లేసుల్లో పని చేస్తున్నట్లు గుర్తించామన్నారు. నిబంధనల అమలును బేఖాతరు చేసిన వారి వివరాలు నమోదు చేసుకొని తొలి తప్పు కింద హెచ్చరించినట్లు అధికారులు వివరించారు. వేసవి కాలంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తగిలే ప్రాంతాల్లో పనిపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?