ఏపీలో కొత్తగా 10,820 కరోనా కేసులు నమోదు
- August 09, 2020
అమరావతి:ఏపీలో మరోసారి కరోనా కేసులు పదివేలు దాటాయి. గత 24 గంటల్లో 62,912 శాంపిల్స్ ను పరీక్షించగా 10,820 మందికి కోవిడ్ నిర్ధారణ అయింది. ఇక కరోనా కారణంగా గుంటూరు లో పన్నెండు మంది, ప్రకాశం లో పదకొండు మంది, చిత్తూర్ లో పది మంది, పశ్చిమ గోదావరి లో పది మంది, అనంతపూర్ లో ఎనిమిది మంది, కడప లో ఎనిమిది మంది, శ్రీకాకుళం లో ఎనిమిది మంది, కర్నూల్ లో ఏడుగురు, తూర్పు గోదావరి లో ఆరుగురు, విశాఖపట్నం లో ఆరుగురు, కృష్ణ లో నలుగురు, నెల్లూరు లో నలుగురు , విజయనగరం లో ముగ్గురు మరణించారు. మరోవైపు గడచిన 24 గంటల్లో 9,097 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 2,24,965 పాజిటివ్ కేసు లకు గాను 1,35,817 మంది డిశ్చార్జ్ కాగా.. 2,036 మంది మరణించారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 87,112 గా ఉంది.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







