హైదరాబాద్:ప్లాస్మా డొనేషన్ కు అశేష స్పందన
- August 10, 2020
హైదరాబాద్:కరోనా బాధితుల ప్రాణాలు నిలిపేందుకు సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (SCSC) సంయుక్తంగా చేపట్టిన ‘ప్లాస్మా డొనేషన్’కు మహా స్పందన వస్తోంది. కరోనా బారిన పడి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు వస్తుండడంతో వందలాది మంది ప్రాణాలు కాపాడే అవకాశం దక్కుతోంది. https://donateplasma.scsc.in/ ఆన్‌లైన్ పోర్టల్ మొదలైన వారం రోజుల్లోనే వెయ్యి మంది ప్లాస్మా దాతల జాబితాను సైబరాబాద్ పోలీసులు సేకరించారు. ఇప్పటికి రక్తం, ప్లాస్మా ఇచ్చేందుకు చాలా మంది ఈ ఆన్‌లైన్ పోర్టల్‌లో రిజిష్టర్ చేసుకుంటున్నారు. వారిచ్చిన బ్లడ్ గ్రూప్ ఆధారంగా అవసరార్థులను గుర్తించి ప్లాస్మాను ఇవ్వడానికి మధ్య వారధిగా సైబరాబాద్ పోలీసులు పనిచేస్తున్నారు. ఇప్పటివరకు 317 మంది ప్లాస్మా దానం చేసి 480 మందికిపైగా కరోనా రోగుల ప్రాణాలు కాపాడారు. అయితే ఈ సామాజిక ఉద్యమానికి సెలబ్రిటీలు ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేయాలంటూ పిలుపునివ్వడంతో మరింతగా దాతలు పెరగొచ్చని పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.500 ఎంఎల్ ప్లాస్మా ఇద్దరి ప్రాణాలు నిలుపుతుంది. ఇవి వారి కుటుంబాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ అన్నారు.
సైబరాబాద్ కోవిడ్ కంట్రోల్‌రూమ్ నంబర్లు: 90002 57058, 94906 17444 రిజిష్టర్ పోర్టల్ లింక్: https://donateplasma.scsc.in/



తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







