విదేశాలలో చిక్కుకుపోయిన యూఏఈ వాసులకు ముఖ్య గమనిక..

- August 10, 2020 , by Maagulf
విదేశాలలో చిక్కుకుపోయిన యూఏఈ వాసులకు ముఖ్య గమనిక..

యూఏఈ: విదేశాలలో చిక్కుకున్న యూఏఈ రెసిడెన్సీ వీసాదారులు అబుధాబి విమానాశ్రయంలో దిగినట్లైతే, వారు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజెన్షిప్ (ICA) నుండి ట్రావెల్ పర్మిట్ పొందవలసిన అవసరం లేదంటూ అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయం విమానయాన సంస్థలకు తెలియజేసింది. ఈ సవరించిన ప్రయాణ నియమం ఆగస్టు 11 నుండి అమల్లోకి రానుంది. యూఏఈ వెలుపల చిక్కుకొని, ఆమోదం కోసం వేచి ఉన్న ప్రవాసులకు ఇది చాలా ఉపశమనం కలిగిస్తుందని ప్రభుత్వం భావించింది.

COVID-19 ముందు జాగ్రత్త చర్యల కారణంగా విదేశాలలో చిక్కుకున్న యూఏఈ నివాసితులకు ఐసిఎ అనుమతి తప్పనిసరి. దుబాయ్ రెసిడెంట్ వీసా ఉన్నవారు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (జిడిడిఆర్ఎఫ్ఎ) నుండి అనుమతి పొందాలి. అబుదాబి, షార్జా, అజ్మాన్, ఉమ్ అల్ క్వాయిన్, రాస్ అల్ ఖైమా మరియు ఫుజైరా నుండి వీసాలు ఉన్న వారు యూఏఈ కి ప్రయాణించడానికి అనుమతి పొందడానికి ఐసిఎ యొక్క స్మార్ట్ ఛానెళ్లలో నమోదు చేసుకోవాలి. కానీ, నేడు ప్రకటించిన సవరణ ను అనుసరించి వారు అబుధాబి విమానాశ్రయానికి వస్తే ఐసిఎ అనుమతి అవసరం లేదు.

అయితే, కోవిడ్ -19 పిసిఆర్ పరీక్షతో సహా అన్ని ఇతర ప్రయాణమార్గదర్శకాలు అబుధాబి/యూఏఈ లోని ఏదైనా ఇతర విమానాశ్రయానికి వచ్చే ప్రయాణీకులందరికీ తప్పనిసరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com